
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
శంఖవరం: చదువుపై దృష్టి సారించడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కృష్ణాలయం వీధిలో కనిగిరి వర లక్ష్మీ అపర్ణ(16) మంగళవారం రాత్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అన్నవరం అడిషనల్ ఎస్సై ఎల్ ప్రసాద్ వివరాల మేరకు, స్థానిక ఆదర్శ పాఠశాలలో అపర్ణ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం కళాశాలకు వెళ్లొచ్చిన ఆమె ఇంటి వద్ద చదువుపై దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అపర్ణ తన తల్లిదండ్రులు పడుకున్నాక, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిర్జీవంగా ఉన్న కు మార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అపర్ణ మృతికి పాఠ శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు.