
బాలలతో భిక్షాటన చేయించడం నేరం
కాకినాడ రూరల్: బాలలతో భిక్షాటన చేయించడం నేరమని జిల్లా బాలల సంక్షేమాధికారి సీహెచ్ వెంకట్రావు అన్నారు. వీధి బాలల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట గ్రామ శివారు కొత్తూరు వద్ద నలుగురు వీధి బాలలను శనివారం సాయంత్రం గుర్తించారు. బాలల తల్లిదండ్రులు పల్నాడు జిల్లా వినుకొండగా గుర్తించారు. ప్లాస్టిక్ సామగ్రి ఏరుకుంటూ, గ్యాస్ స్టౌవ్‌ల రిపేరు చేస్తూ జీవనోపాధి పొందుతున్న తల్లిదండ్రులు పిల్లలను భిక్షాటనకు ప్రోత్సహించడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు వెంకట్రావు తెలిపారు.
ఇద్దరు పిల్లలను అంగన్‌వాడీ సెంటరులో, ఒకరిని ఎంపీపీ స్కూల్, మరోకరిని జెడ్పీ స్కూల్‌లో చేర్చామన్నారు. ఐసీడీఎస్ సీడీ లక్ష్మి సహకారంతో వీధి బాలల గుర్తింపు కాకినాడ పరిసరాలలో చేపడుతున్నట్టు తెలిపారు.