
నిరంతర విద్యుత్ అందించాలి
రాజమహేంద్రవరం సిటీ: వినియోగదారులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అందించేలా పనిచేయాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు. ఆయన శనివారం రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో సమీక్షించారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్ స్టేషన్లు, కొత్త ఫీడర్ల ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్‌ఈ కార్యాలయం నుంచి కోటిలింగాల ఘాట్ వరకు విద్యుత్ స్తంభాలను తొలగించి అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ కార్యాలయాన్ని దివాన్ చెరువులో ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వేపకాయలదిబ్బ సబ్ స్టేషన్‌ను పరిశీలించారు.