
నేడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాక
సీతానగరం: కూటమి ప్రభుత్వంలో మండలంలో రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. శుక్రవారం మండలంలోని చినకొండేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి కేవలం పది టన్నుల యూరియా (220 బస్తాలు మాత్రమే) వచ్చింది. సమాచారం అందుకున్న నాలుగు వందల మంది రైతులు పీ ఏసీఎస్‌కు తరలివచ్చారు. దానితో యూరియా బస్తాలు 220 ఉండటంతో నాగంపల్లి, చీపురుపల్లి రైతులకు 80 బస్తాలు, చినకొండేపూడి రైతులకు 140 బస్తాలు అందించడానికి సొసైటీ సీఈవొ సుబ్బారాజు సిద్ధం చేశారు. ఒక్క రైతు కు ఒక్క యూరియా బస్తా చొప్పున అందించారు. మిగిలిన రైతుల పేర్లు నమోదు చేసుకు ని వెనక్కి పంపించారు. యూరియా వచ్చిన తరువాత పేర్లు నమోదు చేసిన రైతులకు అందిస్తామని సీఈవో సుబ్బరాజు తెలిపారు