
తొగరపాయలో వ్యక్తి గల్లంతు
కపిలేశ్వరపురం: మండలంలోని కేదారిలంక శివారు వీధివారిలంకకు చెందిన పల్లి చిట్టియ్య (65) తొగరపాయలో గల్లంతయ్యాడు. తన నివాసం నుంచి గురువారం ఉదయం తాతపూడి లంక పొలానికి వెళ్లి వస్తుండగా ప్రవాహంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆదేశాలపై ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, తహసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం తొగరపాయ సమీపంలో పడవలతో గాలించినా ఫలితం లేకపోయింది. ఆచూకీ తెలిసిన వారు మండపేట సీఐకి 94407 96537, అంగర ఎస్సై హరీష్ కుమార్‌కు 94409 00770 నంబర్లలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

తొగరపాయలో వ్యక్తి గల్లంతు