బార్లపై కూటమి.. సిండికేట్‌ కన్ను! | - | Sakshi
Sakshi News home page

బార్లపై కూటమి.. సిండికేట్‌ కన్ను!

Aug 29 2025 2:38 AM | Updated on Aug 29 2025 2:38 AM

బార్లపై కూటమి.. సిండికేట్‌ కన్ను!

బార్లపై కూటమి.. సిండికేట్‌ కన్ను!

8 లో

శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సాక్షి, రాజమహేంద్రవరం: బార్లు దక్కించుకునేందుకు కూటమి సిండికేట్‌ కుయుక్తులు పన్నుతోందా.? ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు భారీగా తగ్గించుకునేందుకు కుట్రలు చేస్తోందా? ఇందులో భాగంగా మద్యం వ్యాపారులు ఒక్కటైపోయారా? ప్రభుత్వానికి చెల్లించాల్సిన బార్‌ లైసెన్స్‌ ఫీజులు తగ్గించే వరకు దరఖాస్తులు చేయకూడదని నిర్ధారించుకున్నారా? ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉండగా జిల్లావ్యాప్తంగా 25 బార్లకు కేవలం 8 దరఖాస్తులే రావడం ఇందుకు బలం చేకూరుస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బార్ల లైసెన్సుల ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీల సిండికేట్‌ కన్నేసింది. ప్రభుత్వం అర్బన్‌ ప్రాంతాల్లో బార్‌ ఫీజు ఏకంగా ఏడాదికి రూ.70 లక్షల నిర్ధారించడంపై గుర్రుగా ఉంది. ఎలాగైనా ఫీజు తగ్గించుకొని లాభం పొందేందుకు తెరవెనుక కుట్రలు ప్రారంభించింది. ప్రధానంగా అర్బన్‌ ప్రాంతాల్లో దరఖాస్తులు చేయకుండా మిన్నకుండి పోయినట్లు సమాచారం. దీంతో ఎకై ్సజ్‌ అధికారులు స్పందన రాలేదంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపితే.. ప్రభుత్వం దరఖాస్తులు రాలేదన్న నెపంతో ఫీజులు తగ్గించి కూటమినేతలకు లాభం చేసే ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా.. కూటమి సిండికేట్‌ మాత్రం కాసులు కొల్లగొట్టనుంది. లోలోపల ఈ కుట్రలకు తెర తీసిపైకి మాత్రం పర్మిట్‌ రూములు, బెల్ట్‌ షాపులు అత్యధికంగా ఉండడంతో తాము వ్యాపారం చేయలేమంటూ కూటమి నేతలకు చెందిన సిండికేట్‌ కలరింగ్‌ ఇస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో 25 బార్లు

జిల్లావ్యాప్తంగా మొత్తం 25 బార్లు ఉన్నాయి. వాటిలో 3 బార్లు కల్లుగీత కార్మికులకు రిజర్వ్‌ చేయగా.. మిగిలినవి ఓపెన్‌ కేటగిరిలో కేటాయిస్తారు. ఇందులో రాజమహేంద్రవరంలో 19, కొవ్వూరు 2, నిడదవోలు 3 బార్లు ఉండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం టూరిజం ప్రదేశాల్లో బార్లకు అనుమతులు ఇస్తున్నారు. కడియపులంకలో ఒక బార్‌కు అనుమతులు ఇవ్వనున్నారు.

దరఖాస్తుల ఆహ్వానానికి స్పందన కరవు

జిల్లావ్యాప్తంగా 25 బార్లకు లైసెన్సు ఇచ్చేందుకు వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులు గడువు పెట్టారు. 25 బార్లకు గాను కేవలం ఎనిమిది దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అది కూడా.. 8 బార్లకు మాత్రం ఒక్కో బార్‌కు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయి. రాజమహేంద్రవరం నగరం నుంచి నాలుగు దరఖాస్తులు రాగా, మిగిలిన ప్రాంతాల నుంచి నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగిలిన వాటికి దరఖాస్తు చేసుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో అవాకై ్కన ఎకై ్సజ్‌ అధికారులు తిరిగి నెల 29వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రతిపాదించిన మేరకు 25 బార్ల లైసెన్సులను రాబట్టాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారులకు టార్గెట్లు ఉండటంతో.. వీటిని పూర్తి చేసేందుకు వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మరోమారు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ఆరోజు సాయంత్రం 6 గంటల లోపు వ్యాపారులు తమ దరఖాస్తులను నేరుగా కార్యాలయం వద్ద అందించాలని సూచించారు.

రూ.కోట్లు పెట్టి నష్టపోతామన్న ఆందోళన

బార్‌ ఏర్పాటుకు రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 10 కిలోమీటర్ల లోపు బార్‌ ఏర్పాటు చేసుకునే వారికి ఒక్కో బార్‌కు ఏడాదికి రూ.70 లక్షల ఫీజు నిర్ధారించారు. నిడదవోలులో రూ.37.50 లక్షలుగా నిర్ణయించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించే షాపులకు ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తారు. నిర్దేశించిన ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలి. బార్‌ నిర్వహణ కోసం భవనం అద్దె కనీసం రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు అందులో పనిచేసే సిబ్బందికి వేతనాలు, పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇలా అన్నీ లెక్క గడితే ఏడాదిలో రూ.కోట్లలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా ఆదాయం వస్తుందా..? రాదా..? అన్న మీమాంస వ్యాపారుల్లో నెలకొంది. దీనికితోడు ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. అమ్మకాల్లో ఇంత శాతం ప్రభుత్వానికి చెల్లించాలన్న నిబంధన వ్యాపారుల్లో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు ఏడాదిలో రూ.కోటి రూపాయల విక్రయాలు జరిగితే.. అందులో రూ.10 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే.. కనీసం వడ్డీ డబ్బులైనా వస్తాయా? లేదా? అన్న ప్రశ్న వ్యాపారుల్లో ఉత్పన్నమవుతోంది. దీంతో మద్యం సిండికేట్‌ దరఖాస్తు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

సర్కారుపై ఒత్తిడి కోసమే..

కూటమి సర్కారు కాసుల కక్కుర్తితో ఇప్పటికే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇచ్చేసింది. బార్లను తలపించేలా అమ్మకాలు జరుగుతున్నాయి. మందుబాబులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నారు. దీనికితోడు జిల్లాలో ఎక్కడ చూసినా అనధికారిక బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయి. మందు డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా మందు విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మద్యం ఇలా ఏరులై పారుతుంటే.. బార్లకు వచ్చి పనిగట్టుకుని మద్యం సేవించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బార్‌ లైసెన్సుల కోసం దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. దరఖాస్తుతో చెల్లించే రూ.5 లక్షలు వెనక్కు తిరిగి రావు. తిరిగిరాని దరఖాస్తు రుసుము కూడా అత్యధికంగా పెంచి కట్టించుకోవడం వ్యాపారులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే సిండికేట్‌గా ఏర్పడిన మద్యం వ్యాపారులు దరఖాస్తు ఫీజు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి ఎక్కువగా దరఖాస్తులు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్లీ గడువు పెంచి అవకాశం ఇచ్చినప్పటికీ, ఫీజులు తగ్గించకపోవడంతో మద్యం షాపుల నుంచి బార్ల ఏర్పాటుకు ఎంతమంది వ్యాపారులు ముందుకు వస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో

తీవ్రమైన పోటీ

బార్లంటే గతంలో పోటీ తీవ్రంగా ఉండేది. ఒక్కో బార్‌కు కనీసం 5 నుంచి పది మంది వ్యాపారులు పోటీ పడి మరీ దక్కించుకునే వారు. దరఖాస్తులు సైతం కుప్పలు తెప్పలుగా వచ్చేవి. వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ఒక్కో బార్‌కు ఒకటి చొప్పున కూడా దరఖాస్తులు రాలేదు.

దక్కించుకునేందుకు ఎత్తుగడలు

పర్మిట్‌ రూములు, బెల్ట్‌ షాపులు

అధికంగా ఉన్నాయంటూ పైకి కలరింగ్‌

అంతర్గతంగా మాత్రం సింహభాగం షాపులు కై వసం చేసుకునేందుకు పావులు

లైసెన్సు ఫీజు తగ్గించుకొని బార్లు హస్తగతం చేసుకునేందుకు ఎత్తులు

అందులో భాగంగానే బార్లకు దరఖాస్తు చేయకుండా కాలయాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement