
వైఎస్సార్ సీపీ న్యాయ విభాగ జిల్లా అధ్యక్షుడిగా సీపీఆర్
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన సీపీఆర్ రెడ్డిని వైఎస్సార్ సీపీ న్యాయవిభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుకు రమకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పదవికి ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
దేవీ నవరాత్ర మహోత్సవానికి
పందిరి రాట
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక దేవీచౌక్‌లో వేంచేసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట ముహూర్తం గురువారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ దేవీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజ రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావులతో ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు పందిరి రాటకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహింపజేశారు. దేవీచౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం గురువారం ఉదయం నిర్వహించిన రాట ముహూర్తం కార్యక్రమంలో మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మా ర్గాని భరత్‌రామ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కూడా రాట ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏపి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు పాల్గొన్నారు.
ధ్రువపత్రాల పరిశీలన
పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో 1,351 మంది సర్టిఫికెట్లు పరిశీలించాల్సి ఉండగా తొలి రోజు గురువారం 1,029 మంది తమ సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో గురువారం రాత్రి 10 గంటలకు 750 పైగా పూర్తయ్యాయి. మిగిలినవి శుక్రవారం పరిశీలించనున్నారు. ఆయన వెంట డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు ఉన్నారు.

వైఎస్సార్ సీపీ న్యాయ విభాగ జిల్లా అధ్యక్షుడిగా సీపీఆర్