
● మహా గణపతిం..
జిల్లాలో వాడవాడలా బుధవారం గణపతి ఉత్సవాలు ప్రారంభమైయ్యాయి. చిట్టి వినాయక బొమ్మల నుంచి భారీ విగ్రహాలు మండపాలలో కొలువుదీరాయి. వివిధ ఆకారాలలో గణపతి విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల ఆలంకరణలతో మండపాలను కాంతివంతం చేశారు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 16వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా 18 అడుగులు ఎత్తైన శుభంకర మహా గణపతి వినాయకుడి విగ్రహాన్ని నూలు పోగులు, పసుపుతాడుతో రూపొందించారు. సీ్త్ర రూపంలో గణపతిని ప్రతిష్ట చేయడం ఇక్కడ విశేషం. ఇది శక్తి గణపతి అని, పురాణాలలో దీని ప్రస్తావన ఉందని నిర్వాహకురాలు, వైఎస్సార్ సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
రాజమహేంద్రవరం పుష్కరాల రేపు వద్ద
శుభంకర మహా గణపతి