
● ●‘గణ’ స్వాగతానికి సిద్ధం
రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు సెంటర్‌లో భక్తుల రద్దీ
గణపతి విగ్రహాలు
పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే వినాయక చవితికి సర్వం సిద్ధమైంది. ప్రజల పూజలందుకోవడానికి గణనాథుడు బుధవారం తరలి రానున్నాడు. ఆయనకు ఘనంగా స్వాగతంపలికేందుకు జిల్లా అంతటా ఏర్పాటు చేసిన చవితి మండపాలు కనువిందు చేస్తున్నాయి. ఆకట్టుకునే డిజైన్లు, మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో వాటిని అలంకరించారు. జిల్లాలోని గణపతి ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. పండగ సందర్భంగా మంగళవారం మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

● ●‘గణ’ స్వాగతానికి సిద్ధం