
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 28 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 28 అర్జీలు వచ్చాయి. ఉదయం నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆయనకు నేరుగా తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఎస్పీ నరసింహకిశోర్ అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి అర్జీలను పరిశీలించి సంబంధిత స్టేషన్ ఇన్‌స్పెక్టర్లతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టపరిధిలో వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఉత్వర్వులిచ్చారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు ఉన్నాయి. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు పాల్గొన్నారు.
యూరియా
కోసం రైతుల అగచాట్లు
దేవరపల్లి: ఖరీఫ్‌లో వరి పంటకు ప్రధానంగా వాడుతున్న యూరియా ఎరువు కొరత ఏర్పడింది. దేవరపల్లి మండలంలోని త్యాజంపూడి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు రెండు రోజులుగా పడిగాపులు పడుతున్నారు. ఆదివారం గ్రామంలోని రైతులంతా సొసైటీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో రైతుల మధ్య తోపులాటలు, నెట్టుకోవడం, కొట్లాటకు దారి తీసింది. కూటమి ప్రభుత్వ సానుభూతి పరులు, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు ఎక్కువ బస్తాలు ఇస్తున్నారని, చిన్న, సన్న కారు రైతులకు ఇవ్వడంలేదని రైతులు ఆరోపించారు. రైతులు ఆందోళనకు దిగడంతో యూరియా పంపిణీ నిలిపివేశారు. రైతుకు అరబస్తా చొప్పున సోమవారం పంపిణీ ప్రారంభించారు. యర్నగూడెం, త్యాజంపూడి సొసైటీలో అరబస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నారు. త్యాజంపూడి సొసైటీలో 12.5 మెట్రిక్ టన్నులు, యర్నగూడెం సొసైటీలో 12.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు ఎకరాకు అరబస్తా చొప్పున పంపిణీ చేస్తున్నామని మండల వ్యవసాయాధికారి కె.కమల్‌రాజ్ తెలిపారు. రెండు రోజుల్లో మరొక 50 టన్నుల యూరియా వస్తుందన్నారు. మోతాదుకు మించి యూరియా వాడడం వల్ల కొరత ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ అధికారుల సిఫారసు ప్రకారం ఎకరాకు మొదటి దఫాగా అర బస్తా యూరియా వేయవలసి ఉంది. పొట్టదశలో రెండవ దఫాగా అర బస్తా ఎరువు వేయాలి.
అక్టోబర్ 7న తెలుగు సాహిత్య సదస్సు
రాజానగరం: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని వైఎన్ కళాశాలలో అక్టోబర్ 7న శ్రీతెలుగు సాహిత్యం – భాషా బోధన మనోవికాసంశ్రీ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగనుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ని సోమవారం విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దక్షిణాంధ్రయుగ సాహిత్యం, శతక సాహిత్యం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, జానపద, గిరిజన విజ్ఞానం, ప్రాథమిక, ఉన్నత విద్య, మాతృ భాష బోధన అంశాల పై పరిశోధన పత్రాలను సెప్టెంబర్ 25లోపు పంపించాలన్నారు. కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ పిట్టా శాంతి పాల్గొన్నారు.

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 28 అర్జీలు