
పరీక్ష నిర్వహించకుండానే వైకల్య శాతం తగ్గింపు
ధవళేశ్వరం గ్రామానికి చెందిన యాదంరెడ్డి కొండలరావు మానసిక దివ్యాంగుడు. 2007 సంవత్సరంలో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 50 శాతం మానసిక వైకల్యంతో ఉన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి దివ్యాంగుల కోటాలో పింఛను పొందుతున్నారు. టీడీపీ గత ప్రభుత్వంలో పదేళ్లు ఇదే వైకల్య శాతంతో పింఛను వచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సైతం పింఛను అందింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రీ వెరిఫికేషన్‌లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే 25 శాతం వైకల్యం ఉన్నట్లు రాసేశారని ఆయన బంధువు ఆవేదన చెందుతున్నారు. ఏ ఆర్థిక ఆధారం లేని తమకు తిరిగి పింఛను పునరుద్ధరించాలని కోరింది.