
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు సందీప్ ఎంపిక
పి.గన్నవరం: రామచంద్రపురంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి కలిగితి సందీప్ బాలుర అండర్–16 లాంగ్ జంప్‌లో ప్రథమ, 60 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానాలు సాధించాడు. దీంతో అతడిని ఈ నెల 9, 10, 11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు హెచ్‌ఎం కె.ఉమాదేవి తెలిపారు. ఆమెతో పాటు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు సందీప్‌ను అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
మలికిపురం: రామచంద్రపురంలో ఎస్‌కేపీజీఎన్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి వివిధ స్కూళ్లకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. కేశనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 200 మీటర్ల రన్నింగ్‌లో ఎస్.సత్యసాయికృష్ణ, ప్రథమ, పి.అభిలాష్ తృతీయ, లాంగ్ జంప్‌లో ఎస్.సత్యసాయి కృష్ణ ద్వితీయ, పి.అభిలాష్ తృతీయ స్థానంలో నిలిచారు. సత్యసాయికృష్ణ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అలాగే బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.మోహన్, ఎ.గీతిక, జి.భార్గవి, పి.జ్యోతి, కె.ప్రసన్న, కె.శ్రీరామ్ వివిధ క్రీడాంశాల్లో ఎంపికయ్యారు.
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు స్థాని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కె.లక్ష్మీ ప్రసన్న, డి.దోనేశ్వర్ వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.