
మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అపరిష్కృత సమస్యలపై
జర్నలిస్టుల ప్రదర్శన
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు తమ సమస్యలపై మంగళవారం జర్నలిస్టులు రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎం.శ్రీరామమూర్తి నేతృత్వంలో జర్నలిస్ట్స్ డిమాండ్స్ డే పాటించారు. తొలుత రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అక్రిడిటేషన్లను తక్షణం మంజూరు చేయాలని. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని శ్రీరామమూర్తి మంత్రికి వివరించారు. క్యాబినెట్‌లో ఈ అంశం చర్చిస్తానని మంత్రి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె.పార్థసారథి. సంఘ నాయకులు అప్పలనాయుడు, ఫయాజ్, ఎన్‌ఎన్‌ఎన్ సత్యనారాయణ, కె.శ్రీనివాస్, జి.గోపి, గోపాలకృష్ణ, రమేష్‌రాజా, పాలపర్తి శ్రీనివాస్, విశ్వనాథ్, మధు, ఆకుల ఈశ్వర్, దుర్గాప్రసాద్, తిరుమల, ఆనంద్, వీరబాబు, బాబీ, ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కడియపులంక సర్పంచ్‌గా పద్మావతి ఏకగ్రీవం
కడియం: మండలంలోని కడియపులంక గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచ్‌గా మారిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మణికుమార్ మంగళవారం ఆమెకు ధ్రువీకరణ పత్రం అందించారు. కడియపులంక సర్పంచ్‌గా ఎన్నికై న మార్గాని అమ్మాణీ ఏడుకొండలు మృతి చెందడంతో ఇక్కడ సర్పంచ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అన్ని రాజకీయ పార్టీలు అమ్మాణీ ఏడుకొండలు కుమార్తె మారిశెట్టి పద్మావతిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేందుకు అంగీకరించాయి. దీంతో పద్మావతి నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు.

మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత

మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత