
జన యోధుడు జక్కంపూడి
రాజమహేంద్రవరం సిటీ: మాజీ మంత్రి, జన యోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్‌రావు రాజకీయల్లో చేసిన సేవలు, ప్రజలకు అందించిన సంక్షేమం నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, మార్గదర్శకమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నివాళులర్పించారు. బుధవారం స్థానిక కంబాలచెరువు వద్దనున్న జక్కంపూడి రామ్మోహన్‌రావు విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, తమలాంటి వారెందరికో రాజకీయపరంగా జక్కంపూడి రామ్మోహన్‌రావు మార్గదర్శకులన్నారు. రాజకీయ వేదికపై ఎందరినో శిష్యులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్‌రావు ఓ సంచలనమన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తామంతా జక్కంపూడి రామ్మోహన్‌రావు మార్గదర్శకత్వంలో ఈ స్థాయిలో ఉన్నామన్నారు. సమస్యలపై ఎవరెళ్లినా రాత్రీపగలూ తేడా లేకుండా రోడ్డెక్కిన పోరాడారని కొనియాడారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, తొలి నుంచీ తాను జక్కంపూడి అనుచరుడిగానే రాజకీయాల్లో కొనసాగినట్టు తెలిపారు. ఏపీహెచ్‌బీసీ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహన్‌రావు జీవనం యువతకు ఆదర్శప్రాయమన్నారు. ఆయన బాటలోనే పేదల సేవలో కొనసాగుతున్నామన్నారు. జక్కంపూడి రామ్మోహన్‌రావు తనయుడు, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ, తండ్రి తమకు అశేష అభిమాన గణాన్ని ఆస్తిగా ఇచ్చారన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా, అభిమానుల రూపంలో నిత్యం కళ్లముందే ఉంటున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు అనునిత్యం పాటుపడతామన్నారు. నేటికీ ప్రజల హృదయాల్లో ఆయన ముద్ర చెరగలేదన్నారు. రాష్ట్రంలో గడ్డుకాలం నడుస్తోందని, కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా భరించాలని, తర్వాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నాయకులు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, పెద్దిరెడ్డి అభినవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ చోట్ల భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో పాటు, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వృద్ధులకు దుస్తుల పంపిణీ, ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధాశ్రమాల్లో అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బుర్రిలంకలో రక్తదాన శిబిరాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సందర్శించారు.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరంలో
ఘనంగా జయంతి వేడుకలు

జన యోధుడు జక్కంపూడి