
జనసేన నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం దొమ్మరులో బుధవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకులు కొమ్మన మణిబాబు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన జనసేన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. గ్రామానికి చెందిన కొల్లేపి మణి, సీతా నవీన్, ఇంటి వెంకటసాయి, సీతా అఖిల్, సీతా పోసి, పడాల వెంకటేష్, మావూడూరి తాతారావు, పడాల దిలీప్ తదితరులకు పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేతులమీదుగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, తాళ్లపూడి, చాగల్లు మండలాల కన్వీనర్లు కొలిశెట్టి నాగేశ్వరరావు, మట్టా వెంకట్రావు, సర్పంచ్ తానేటి కుమారి, నాయకులు ముదునూరు నాగరాజు, వేంపాటి సురేష్, సుంకర సత్యనారాయణ, పోసిన దేవరాయలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ యువజన జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన రెడ్డి ఆదేశాల మేరకు జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సునీల్‌కుమార్‌ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
మంగళవారం వస్తే
అప్పు కోసం పాకులాట
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రకాశం నగర్: కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పు కోసం పాకులాడే పరిస్థితిలో ఉందని, ఏడాది పాలనలో రూ.1.75 లక్షల కోట్ల అప్పు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన సీపీఐ 26వ జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, వారు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఒక్క సెంట్ భూమి కూడా పేద ప్రజలకు ఇవ్వలేదన్నారు. విజయవాడలో 4 ఎకరాలు, విశాఖపట్నంలో 13 ఎకరాల రూ.వందల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు.
అధిక దిగుబడే లక్ష్యం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మెరుగైన పద్ధతులకు ప్రోత్సాహం, కొత్త సాంకేతికత ద్వారా కొబ్బరి సాగులో దిగుబడి పెంచడమే తమ లక్ష్యమని కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు(సీడీబీ) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథరెడ్డి అన్నారు. స్థానిక జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్–ని ర్కా) సమావేశ మందిరంలో కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు, రాష్ట్ర ఉద్యానవన శాఖ సౌ జన్యంతో ఉద్యోగులకు సాంకేతిక సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎన్.మల్లికార్జునరావు అధ్య క్షత వహించారు. సీడీబీ స్కీమ్స్, ఇంప్లిమెంటేషన్ రకాలు, ప్లాంట్ మెటీరియల్ వైరెటీస్, కోకోనట్ నారుమడుల తయారీ, బీమాపై డాక్టర్ మంజునాథరెడ్డి క్షుణ్ణంగా వివరించారు.
కొబ్బరి సాగు, లోకల్, హైబ్రీడ్ రకాలు, తెగుళ్లు, పురుగులు తదితర అంశాలపై జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.దుర్గేష్, నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్, శాస్త్రవేత్తలు ఎ.కిరీటి, బి.నీరజ, కోకోనట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శరత్ వివరించారు.

జనసేన నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు

జనసేన నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు