
యాప్‌లతో ఒత్తిడికి గురవుతున్నాం
పాత సెల్‌ఫోన్లలో యాప్‌ల వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నెట్‌వర్క్ సరిగా పని చేయకపోవడంతో ఒక్కో నమోదు అర గంటకు పైగా పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5జీ సెల్‌ఫోన్లు లేదా ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు జీతాలు కూడా పెంచడం లేదు. చాలీచాలని జీతాలతోనే జీవనం సాగించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనియన్ నేతలతో ఒక్కసారీ మాట్లాడలేదు. అంగన్‌వాడీ కార్యకర్తలపై పని ఒత్తిడి పెరగడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ, కొత్త సెల్‌ఫోన్లు ఇచ్చే వరకూ సెల్‌ఫోన్లతో పనిచేయడం జరగదు.
– యాళ్ల బేబీరాణి, జిల్లా కార్యదర్శి,
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, తూర్పు గోదావరి