చంద్రబాబుది క్రిమినల్‌ మైండ్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది క్రిమినల్‌ మైండ్‌

Aug 6 2025 6:28 AM | Updated on Aug 6 2025 6:28 AM

చంద్ర

చంద్రబాబుది క్రిమినల్‌ మైండ్‌

ఫ ఆయన జీవితంలో

ఎవ్వరికీ మంచి చేసింది లేదు

ఫ పాలన గాలికి వదిలి,

కేసులు పెట్టడంపైనే దృష్టి

ఫ మాజీ సీఎంకు దగ్గరగా ఉన్న బలమైన

నేతలను ఇబ్బందులు పెడుతున్నారు

ఫ వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

సాక్షి, రాజమహేంద్రవరం: ‘సీఎం చంద్రబాబు జీవితం, రాజకీయ ప్రస్థానం మొత్తం క్రిమినల్‌ మైండ్‌తోనే సాగుతోంది. ఎంతసేపూ ఏదో ఒక రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి.. అధికారం ఏ రకంగా చేజిక్కించుకోవాలి.. ప్రతిపక్ష నేతలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మినహా.. ప్రజలకు మంచి చేసింది లేదు’ అని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. మద్యం అక్రమ కేసులో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన తండ్రి, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జక్కంపూడి రాజా, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం మంగళవారం ములాఖత్‌ అయ్యారు.

ఈ సందర్భంగా జైలు వద్ద రాజా మీడియాతో మాట్లాడుతూ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే.. చంద్రబాబు మళ్లీ మద్యం తీసుకొచ్చారన్నారు. సారా దగ్గర మొదలైన ఆయన నేడు రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపులు, మద్యం డిస్టిలరీల యజమానులతో కుమ్మకై ్క అడ్వాన్స్‌ పేమెంట్లు ఇవ్వడం.. ఇలా పూర్తిగా అక్రమ సంపాదనంతా చంద్రబాబు వద్ద ఉంది తప్ప.. మాజీ సీఎం జగన్‌ దగ్గరో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాల వద్దనో లేవని అన్నారు. బాబు పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, శ్రేణులను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వంలోని అధికారులు, చంద్రబాబు, లోకేష్‌ నిమగ్నమయ్యారన్నారు. ఎన్నికల వాగ్దానాలను గాలికొదిలి, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టేందుకే సమయం కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిన వ్యక్తి అని, అనేక వ్యాపారాలతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. అలాంటి కుటుంబంపై బురద చల్లేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బలమైన నేతగా, వెన్నెముకగా ఉన్నారన్న ఉద్దేశంతో మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విధానపరమైన అంశాలతో ఎంపీకి సంబంధం లేకపోయినా.. ఉన్నట్టు కట్టుకథలు అల్లి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానం చెప్పినా, వాటిని పక్కన పెట్టి జైలు లోపల ఆయనను ట్రీట్‌ చేస్తున్న విధానం చూస్తూంటే రాష్ట్రంలో చట్టాలున్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు మాదిరిగా రెండెకరాల నుంచి రూ.లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర పెద్దిరెడ్డి కుటుంబానిది కాదన్నారు.

కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అరెస్టులతో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారన్నారు. అందుకు ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ మండిపడ్డారు.

చంద్రబాబు దమనకాండ

రాష్ట్రంలో చంద్రబాబు దమనకాండ కొనసాగుతోందని పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు తీసుకురాలేని బాబు.. అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు స్వలాభం, చంద్రబాబు మెప్పు కోసం పాటు పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో వెంకటేష్‌ నాయుడు నడుస్తున్నాడని ఆరోపించారు. లిక్కర్‌ స్కామ్‌లో దొరికిన డబ్బంతా చంద్రబాబు దాచి పెట్టినదేనని చెప్పారు. పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్య చౌదరి, పార్టీ లీగల్‌ సెల్‌ ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జి సాదిక్‌, రుడా మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పినిపే శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుది క్రిమినల్‌ మైండ్‌1
1/1

చంద్రబాబుది క్రిమినల్‌ మైండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement