మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ | - | Sakshi
Sakshi News home page

మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ

Aug 5 2025 6:36 AM | Updated on Aug 5 2025 6:36 AM

మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ

మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ

రామచంద్రపురం రూరల్‌: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బంగారపు పూత ఉన్న కవచాన్ని సమర్పించారు. ముందుగా ఆలయంలో నంది మండపం వద్ద వేణు సతీమణి వరలక్ష్మి, కుమారుడు నరేన్‌, కోడలు స్రవంతి, మనుమలు సునిధి, విరాజ్‌తో కలసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బంగారపు చీరను సమర్పించగా, అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని, శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతి తాళ్ల సాంబశివరావు గురూజీ, రామచంద్రపురం జెడ్పీటీసీ సభ్యుడు మేర్నీడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అంబటి భవాని, వైస్‌ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ, సర్పంచ్‌లు యల్లమిల్లి సతీష్‌కుమారి, అనిశెట్టి రామకృష్ణ, పెమ్మిరెడ్డి దొరబాబు, కట్టా గోవిందు, అంబటి తుకారం, ఎంపీటీసీ సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement