
● పుడమితల్లికి పచ్చబొట్లు
తనను ఒకరు పొగడాలనే ఆశతో మేఘం వర్షించదు.. వర్షించడం తన ధర్మం కాబట్టి నెరవేరుస్తుంది. తన పైకి రాళ్లు విసిరిన వారికి, కత్తి దూసిన వారికి సైతం చెట్టు నీడనిస్తుంది. అన్నదాత తీరు కూడా అంతే. ‘పొలంబాట’లో కష్టాల కంటకాలు గుచ్చుకున్నా.. నష్టాల సుడిగుండాల్లో నిండా మునిగిపోతున్నా.. ఎదురీదుతూ.. సమస్త ప్రజానీకానికీ తిండిగింజలు పండిస్తూనే ఉంటాడు. కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తూండటంతో రైతన్నలు సేద్య యజ్ఞానికి ఉపక్రమించారు. మడులను సిద్ధం చేస్తున్నారు. నారు, నాట్లతో పుడమి తల్లికి ‘ఆకుపచ్చ’ బొట్లు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకున్నా.. ఆదుకోకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా.. ఈ మహాయజ్ఞం ఆగదంటూ ముందుకు సాగుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల చిత్రాలివి. – పెరవలి