
కూటమి మోసాలపై ప్రజల్లో ప్రచారం
అనపర్తి : కూటమి ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోని క్యూఆర్ కోడ్ ద్వారా చేరువ చేయాలని ఆయన సూచించారు. గురువారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర యుజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా పార్టీ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను వారికి వివరించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సంసిద్ధంగా ఉండి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చి వైఎస్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్‌లు, పార్టీ ముఖ్య నేతలు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.