
కొనసాగుతున్న సీహెచ్‌ఓల నిరవధిక సమ్మె
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యాన సీహెచ్‌ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరంలో సీహెచ్‌ఓలు పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ నిర్వహించి, సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేసిన సైనికులకు వందనం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని, విలేజ్ క్లినిక్ అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పీఎఫ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.