
ఏపీఎస్పీలో ఉత్సాహంగా క్రీడలు
● రెండో రోజు హోరాహోరీగా పోటీ ● నేటి సాయంత్రం ముగింపోత్సవం
కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో రేంజ్ – 1 పరిధిలోని నాలుగు బెటాలియన్లకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొంటున్నారు. బుధవారం పరుగు పందెం పోటీలు, హై జంప్, కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, తదితర పోటీలను నిర్వహించారు. మూడు రోజులు పాటు జరగనున్న పోటీలు గురువారం సాయంత్రంతో ముగియనున్నాయి. పోటీలలో ఏపీఎస్పీ కాకినాడ 3వ బెటాలియన్‌తో పాటు విజయనగరం, విశాఖపట్నం, మంగళగిరి బెటాలియన్ల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమంలో బెటాలియన్ల ఐజీ రాజకుమారి, డీఐజీ ఫక్కీరప్ప తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
రెండో రోజు విజేతలు వీరే
హైజంప్ విభాగంలో 5వ బెటాలియన్‌కు చెందిన పి.ప్రసాదరావు, 16వ బెటాలియన్‌కు చెందిన వి.సుధాకర్, వి.శ్రీను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. 1500 మీటర్ల పరుగు పోటీలో తొలి మూడు స్థానాలలో 5వ బెటాలియన్‌కు చెందిన సురేష్‌కుమార్, 16వ బెటాలియన్‌కు చెందిన కె.రాజానాయుడు, 5వ బెటాలియన్‌కు చెందిన పి.సత్యారావు, చెస్ విభాగంలో 16వ బెటాలియన్‌కు చెందిన శివకుమార్ విన్నర్‌గాను, 6వ బెటాలియన్‌కు చెందిన శ్రీను రన్నర్‌గా నిలిచారు. కబడ్డీ విభాగంలో 16వ బెటాలియన్ విన్నర్‌గాను, 5వ బెటాలియన్ రన్నర్‌గా నిలిచారు. క్రికెట్ విభాగంలో 3వ బెటాలియన్ విన్నర్‌గాను, 5వ బెటాలియన్ రన్నర్‌గా నిలిచారు, 200 మీటర్ల విభాగంలో 5వ బెటాలియన్‌కు చెందిన ఎస్.శివకుమార్, 16వ బెటాలియన్‌కు చెందిన జి.శ్రీను, జి.మురళీ విజేతలుగా నిలిచారు. 5వేల మీటర్ల పరుగు విభాగంలో 5వ బెటాలియన్‌కు చెందిన ఎస్.శివకుమార్, వై.సత్యారావు, 16వ బెటాలియన్‌కు చెందిన రాజినాయుడు విజేతలుగా నిలిచారు. మారథాన్‌లో 5వ బెటాలియన్‌కు చెందిన ఎం.లక్ష్మణ్, టి.శ్రీనివాసరావు విజేతలుగా నిలిచారు.

ఏపీఎస్పీలో ఉత్సాహంగా క్రీడలు

ఏపీఎస్పీలో ఉత్సాహంగా క్రీడలు