
రుణాలివ్వకపోవడం అన్యాయం
కార్పొరేషన్ రుణాల పేరు చెప్పి, కాపులను ప్రభుత్వం దగా చేసింది. అందరికీ రుణాలని ఆశలు కల్పించి, తీరా యూనిట్ల మంజూరు సమయం వచ్చేసరికి చేతులెత్తేయడం చంద్రబాబు సర్కార్‌కు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఇలానే నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సబ్సిడీ సొమ్ము విడుదల చేయలేనప్పుడు అంత హడావుడిగా రుణ ప్రణాళిక ప్రకటించడమెందుకు? రుణాల మంజూరు ప్రక్రియ మొదలై ఐదు నెలలైనా ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరికై నా రుణం మంజూరు చేసి ఉంటే చెప్పాలి.
– రావూరి వెంకటేశ్వరరావు,
వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం కార్యదర్శి, కాకినాడ
వెంటనే మంజూరు చేయాలి
కుటుంబ పోషణ కోసం వస్త్ర, కిరాణా దుకాణాలు పెట్టుకుందామని బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆ రుణం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఐదు నెలలు గడచినా ఇప్పటి వరకూ రుణం మంజూరు కాలేదు. అధికారులను అడిగితే లబ్ధిదారుల లిస్టు పంపామంటున్నారు. రుణాలు మంజూరైన జాబితాయే రాలేదనీ చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన బీసీ రుణాలు మంజూరు చేయాలి.
– గుబ్బల వీర వెంకట సత్యనారాయణ,
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, రాజోలు
అసలు ఇస్తారా?
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కార్పొరేషన్ రుణాలు వస్తాయని దరఖాస్తుదారులు మూడు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రుణాలు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి. స్వయం ఉపాధికి అవకాశాలు మరింత పెంచాలి. రుణాలకు సంబంధించి సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేయకుంటే బ్యాంకులు మాత్రం ఎలా రుణాలు ఇస్తాయి?
– దుర్వాసుల సత్యనారాయణ,
బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజమహేంద్రవరం
ఆశలు ఆవిరి
ప్రభుత్వం రాయితీ రుణాలిస్తుందని ఆశపడి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మండల స్థాయిలో జాబితాలపై పరిశీలన జరిపి, బ్యాంకుకు వెళ్లేసరికి ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయలేదని సమాధానం చెబుతున్నారు.
సర్కారు ఉదాసీనత కారణంగా ఐదు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నా ఫలితం ఉండటం లేదు. అసలు రుణాలిస్తారో ఇవ్వరో అర్థం కావడం లేదు.
– వేట్ల నాగేశ్వరరావు,
మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు, రామచంద్రపురం

రుణాలివ్వకపోవడం అన్యాయం

రుణాలివ్వకపోవడం అన్యాయం

రుణాలివ్వకపోవడం అన్యాయం