
మిథున్‌రెడ్డిది ముమ్మాటికీ అక్రమ అరెస్టే
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎంపీ మిథున్‌రెడ్డిని ముమ్మాటికీ అక్రమంగానే అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. సెంట్రల్ జైలు వద్ద మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించా రు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మద్యంపై రూ.16,500 కోట్ల వార్షిక ఆదాయం వస్తే, అది జగన్ ప్రభుత్వ హయాంలో రూ.25 వేల కోట్లకు పెరిగిందన్నారు. పైగా ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్ హయాంలో కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదని, గతంలో చంద్రబాబు హయాంలోనే ఇచ్చారని చెప్పారు. లిక్క ర్ స్కామ్ అనడమే తప్ప 13 నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నందున అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు రోజే వైఎస్సార్ సీపీ ఎంపీ, ఫ్లోర్‌లీడర్‌ను అరెస్టు చేయడం ద్వారా సంచలనం సృష్టించాలన్నది ప్రభుత్వ దురుద్దేశమని విమర్శించారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపెడుతు న్నారని మండిపడ్డారు. ఏవో రెండు డిస్టిలరీలను సీజ్ చేసి, వాళ్ల ఆస్తుల జప్తు చేశామని చెప్తే సరిపోదన్నారు. కేవలం ఒత్తిడితోనే సిట్ పని చేస్తోందని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు 300 పేజీల చార్జిషీటు తయారు చేసేస్తే నిజం కాబోదని, మిథున్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని చెప్పా రు. కోర్టు సూచనల ప్రకారం జైలులో ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించకపోవడం అధికారులకు తగదని భరత్‌రామ్ అన్నారు.
ఫ జగన్ హయాంలో మద్యం ఆదాయం పెరిగింది
ఫ ప్రభుత్వమే విక్రయిస్తే అవినీతి ఎక్కడ?
ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్