
సమగ్ర సమాచారం సేకరించాలి
కులగణన ద్వారా సమగ్ర సమాచారం సేకరించాలి. రాజ్యాంగం అందించిన పదవులు, విద్య, ఉద్యోగాల్లో సామాజిక న్యాయం చేసే అవకాశం కుల గణన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కులగణనకు సంబంధించి ఇంత మంది మేధావులు, కుల సంఘాల నాయకులు అభిప్రాయాలు సేకరించడం అభినందనీయం.
– ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ
బీసీలకు న్యాయం
కులగణన చేపట్టడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది. కులగణన జరగకపోవడం వల్ల బీసీల శాతం తక్కువగా కనబడుతోంది. దీనివల్ల రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులను కోల్పోతున్నాం. ఇప్పుడు కులగణన చేపట్టడం వల్ల బీసీల శాతం పెరగడమే కాకుండా రాజకీయ పరంగా సీట్లు ఎక్కువగా వస్తాయి.
– శివ ప్రసాద్, అడ్వకేట్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
సరైన రిజర్వేషన్లు
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కులగణన అనేది ఇప్పటి వరకూ కలగానే మిగిలిపోయింది. కానీ నేడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో కులాల వారీగా సరైన రిజర్వేషన్లు లభిస్తాయి. ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో, వారికి ఎంత శాతం రిజరేషన్లు అమలు అవుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
– ఎండీ ఆరీఫ్, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్
క్రైస్తవులకు గుర్తింపు
కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రైస్తవులకు గుర్తింపు లభించింది. కులగణన చేపట్టడం వల్ల క్రైస్తవులు శాతం ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది.
– డాక్టర్ మోజెస్ బాబు, ఏపీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు
భాగస్వాములు చేయాలి
కులగణనలో కులసంఘాల నాయకులను కూడా భాగస్వాములు చేయాలి. దీని వల్ల కులగణన సర్వే వేగంగా జరుగుతుంది. వలంటీర్లకు స్థానికులు ఏ కులం వారో కొంత తెలుస్తుంది. అదే కుల సంఘాల నాయకులను సర్వేకి తీసుకు వెళ్లడం వల్ల సర్వే తొందరగా పూర్తవుతుంది.
– బి.జార్జీ ఆంథోనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకుడు
కులాలకు మేలు
కులగణన చేపట్టడం వల్ల విద్య, ఉద్యోగం, రాజకీయం తదితర అంశాలలో సరైన న్యాయం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎంతశాతం ఉన్నారో కచ్చితంగా తెలుసుకోవచ్చు. తద్వారా ఆయా కులాలకు మేలు జరుగుతుంది.
– దేవరి అంజలి, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మహిళా కార్యదర్శి
రాజకీయ లబ్ధి
కులగణన చేపట్టక పోవడం వల్ల యాదవులకు నష్టం జరుగుతోంది. ఇన్నేళ్లుగా యాదవులు సంఖ్య ఎంత ఉందో సుమారుగా చెప్పడం తప్ప.. కచ్చితంగా సమాచారం లేదు. దీనివల్ల యాదవులకు పదవులలో అన్యాయం జరుగుతోంది. కులగణన చేపడితే మాకు రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
– సూర్యచంద్ర యాదవ్,
జిల్లా యాదవ్ అసోసియేషన్ సభ్యుడు
శుభసూచకం
1948, 58లో కులగణన చేపట్టారు. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ కులగణనకు శ్రీకారం చేపట్టడం శుభసూచికం. వర్ణ వ్యవస్థలో వృత్తులు పోయి కులాలు మిగిలాయి. ఇప్పుడు ఎవ్వరు కులవృత్తులు చేస్తున్నారో తెలియడం లేదు. ఈ సమయంలో కులగణన చేపట్టడం అభినందనీయం.
– అశోక్ కుమార్ జైన్, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు






