అతి వేగం.. తీసింది ప్రాణం | - | Sakshi
Sakshi News home page

అతి వేగం.. తీసింది ప్రాణం

Jul 30 2026 12:27 AM | Updated on Jul 30 2026 12:27 AM

కొత్తపల్లి: అతి వేగమే ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం–ఉప్పాడ రోడ్డులో కొండయ్యకాలువ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలిపారు. మండలంలోని ఎండపల్లికి చెందిన విజ్జపురెడ్డి రామస్వామి (64), అదే గ్రామానికి చెందిన కామేశ్వరరావు మోటార్‌సైకిల్‌పై పిఠాపురం వెళుతున్నారు. పిఠాపురం నుంచి ఉప్పాడ వస్తున్న కారు కొండయ్య కాలువ వద్ద ప్రమాదవశాత్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో రామస్వామి, కామేశ్వరరావు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని పిఠాపురం ప్రభుత్వాసుత్రికి తరలించారు. రామస్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు డ్రైవర్‌ అతివేగంగా రావడంతో పాటు ఆటోని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై ఎస్సై వెంకటేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement