యానాం: పట్టణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్‌అప్లయన్స్‌స్‌స్టోర్ వైనాట్ షోరూం 45వ బ్రాంచ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి చేతులమీదుగా షోరూమ్‌ను ప్రారంభించారు. సంస్థ అధినేత జుజ్జవరపు వెంకటరాయుడు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లో 44 షోరూమ్‌లు నెలకొల్పామని కస్టమర్ల ప్రోత్సాహంతో యానాంలో మరో షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 2022 నుంచి 2025 వరకు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి బెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ స్టోర్‌గా ఎంపిక కావడం సామాన్య విషయం కాదన్నారు. షోరూమ్‌లో మొదటి కొనుగోలుదారుడు యానాం వర్తకసంఘం అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్‌గా వ్యవహరించారు. జ్యోతిప్రజ్వలనను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రీజినల్ బిజినెస్ హెడ్ కరాటం వెంకటకృష్ణాజీ, సేల్స్‌ను హవెల్స్ ఏపీ స్టేట్ హెడ్ జాయింట్ జనరల్ మేనేజర్ బి.హేమసుందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యాపార ప్రతినిధులు యుగంధర్, నాగవాసు, సుమన్, జీవన్, సుధీర్, రామకృష్ణ, కృష్ణ, ప్రకాష్, కిషోర్ పాల్గొన్నారు.


