దగా డీఎస్సీపై నిరసన సెగ | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై నిరసన సెగ

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరించడం చంద్రబాబుకు అలవాటే. ఆ ప్రకారమే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి పీఠ మెక్కారు. ఇప్పుడు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ద్రోహం చేశారు. అనర్హులకు ఉద్యోగాలను అమ్ముకుని, కష్టబడి చదివిన అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఈ నేపథ్యంలో దగా పడిన నిరుద్యోగులకు అండగా వైఎస్సార్‌ సీపీ నిలిచింది. కూటమి చేసిన అన్యాయంపై నిరసన గళమెత్తింది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించింది.

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో

భారీ ప్రదర్శన

కదం తొక్కిన యువత,

విద్యార్థులు, నిరుద్యోగులు

అమలాపురంలో ర్యాలీ

హాజరైన ఎమ్మెల్సీలు,

పార్టీ కో ఆర్డినేటర్లు

కూటమి తీరును

ఎండగడుతూ నినాదాలు

సాక్షి, అమలాపురం/ అమలాపురం రూ రల్‌/ ఉప్పలగుప్తం: చంద్రబాబు ప్రభుత్వంలో యువత, విద్యార్థులు, నిరుద్యో గులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, యువకులు, విద్యార్థులు కదం తొక్కారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలో మంగళవారం భారీ ప్రదర్శన చేశారు. వందల మంది పార్టీ శ్రేణులు, యువజన, విద్యార్థి విభాగం ప్రతినిధులు నిరసన తెలిపారు. వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ఈ ఆందోళనకు నిరుద్యోగ యువత, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలిపారు.

నల్ల వంతెన నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా జరిగిన ఈ పాదయాత్రకు వందల మంది తరలి రావడంతో అమలాపురం – ముక్తేశ్వరం రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరపాలని, నీట్‌ లీకేజీని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్టుగా, డీఎస్సీ అక్రమాలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కేఎస్‌ఎన్‌ రాజు, ఎస్‌ఈసీ సభ్యులు కాశి బాల మునికుమారి, సాకా మణికుమారి, సాకా ప్రసన్న కుమార్‌, కుడుపూడి భారత్‌ భూషణం, కుడుపూడి వెంకటేశ్వర బాబు, తోరం భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య కుమార్‌, కర్రి నాగిరెడ్డి, దంగేటి రాంబాబు, కర్రి పాపారాయుడు, జక్కంపూడి వాసు, వంటెద్దు వెంకన్నాయుడు, పాటి శివకుమార్‌, రాష్ట్ర, జిల్లా వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు మిండుగుదిటి శిరీష్‌, తోరం గౌతమ్‌ రాజా, కొల్లు త్రినాథవర్మ, ఎస్‌కే ఖాదర్‌, సలాది సతీష్‌, సుదా గణపతి, పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, జిన్నూరి వెంకటేశ్వరరావు, జిల్లేల రమేష్‌, వంగా గిరిజ కుమారి, చీకట్ల కిషోర్‌, ఉండ్రు వెంకటేష్‌, దొమ్మేటి సత్య మోహన్‌, ఉంగరాల సంతోష్‌ కుమార్‌, కుంచే రమణరావు, మందపాటి కిరణ్‌ కుమార్‌, పలివెల సుధాకర్‌, సరేళ్ల రామకృష్ణ, నల్లా వర ప్రసాద్‌, దంతులూరి రోహిత్‌ వర్మ, రుద్రరాజు, చిన్న రాజా, సుంకర సుధ, మద్దింశెట్టి ప్రసాద్‌, తాడి సహదేవ్‌, విత్తనాల మూర్తి, బళ్ల శ్యామ్‌, ములపర్తి శ్రీను, పందిరి రాజేష్‌, విత్తనాల మూర్తి, దొంగ బాలాజీ, తెన్నెటి కిశోర్‌, బడుగు మోహన్‌, చల్లా ప్రభాకరరావు, పెన్మెత్స చిట్టిరాజు, కొవ్వారి సుధాకరరెడ్డి, పొగాకు శ్రీను పాల్గొన్నారు.

ప్రభుత్వానికి

వ్యతిరేకంగా ఫ్లకార్డులను చూపిస్తున్న యువజన , విద్యార్థి విభాగాలనాయకులు

విచారణ జరపాలి

కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.

– విప్పర్తి వేణుగోపాలరావు, ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌

చర్యలు తీసుకోవాలి

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. నిరుద్యోగులకు కూటమి అన్యాయం చేసింది. దానిపై వెంటనే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

– గన్నవరపు శ్రీనివాసరావు, పి.గన్నవరం కోఆర్డినేటర్‌

లోకేశ్‌ రాజీనామా చేయాలి

డీఎస్సీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

– చింతా అనూరాధ, మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ

రాష్ట్ర మహిళా విభాగం జోన్‌–2 అధ్యక్షురాలు

అందరికీ అన్యాయం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది.

– డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌

అంగడిలో పోస్టులు

డీఎస్సీలో అర్హులకు అందజేయాల్సిన ఉద్యోగాలను కూటమి నాయకులు అంగడిలో అమ్ముకున్నారు. ఉద్యోగానికి వెలకట్టి, అనర్హులను అందలం ఎక్కించారు.

– పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌, ముమ్మిడివరం కోఆర్డినేటర్‌

భవిష్యత్తుతో చెలగాటం

విద్యార్థులు, యువత, నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలతో లక్షల మంది అర్హుల కలలు నాశనమయ్యాయి.

– పాముల రాజేశ్వరీదేవి, రాజోలు కో ఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement