యువత తరఫున ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

యువత తరఫున ఉద్యమం

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

డీఎస్సీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేసేంత వరకు నిరుద్యోగ యువత తరఫున ఉద్యమం చేస్తాం. నిరుద్యోగ భృతికి ఇప్పటి వరకు పైసా నిధులు కేటాయించలేదు.

– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ

యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

నైతిక బాధ్యత లేదా?

డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో అనర్హులకు ఉద్యోగాలను అమ్ముకున్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. మరి లోకేశ్‌కు నైతిక బాధ్యత లేదా?.

– చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

త్వరలో తిరుగుబాటు

కూటమి పాలకుల అవినీతి, అక్రమాలపై ప్రజలు త్వరలోనే తిరగబడతారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు దోచిపెట్టడానికే చంద్రబాబు సంపద సృష్టి చేస్తున్నారు.

– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, మండపేట కో ఆర్డినేటర్‌

నిరుద్యోగ భృతి ఏది?

కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీని అమలు చేయలేదు. డీఎస్సీ 2025పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి.

– బొమ్మి ఇజ్రాయిల్‌, ఎమ్మెల్సీ

యువతకు మోసం

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. యువతను మోసం చేసిన ఈ ప్రభుత్వం.. పాలించే అర్హత కోల్పోయింది.

– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ

అవకతవకలు

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే చెల్లించారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.

– పిల్లి సూర్యప్రకాష్‌, వైఎస్సార్‌ సీపీ

యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు,కో ఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement