మోదీ పాలనలో 152 సార్లు పేపర్ల లీక్‌ | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలో 152 సార్లు పేపర్ల లీక్‌

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో 152 సార్లు పేపర్లు లీక్‌ అయ్యాయని, అయితే ఏ ఒక్కదానిలో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సోమవారం కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, వారి ఇళ్లలో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్డీయే విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ తలపెట్టిందని రుద్రరాజు అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోడా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement