పోలీస్‌ గ్రీవెన్స్‌కు 27 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 27 అర్జీలు

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

అమలాపురం టౌన్‌: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి 27 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే తమ తమ చాంబర్లలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 27 అర్జీలు రాగా.. అధికంగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. వారికి ఎస్పీ, ఏఎస్పీలు కౌన్సెలింగ్‌ చేశారు.

ఆక్వా అక్రమ సాగుతో

పర్యావరణానికి విఘాతం

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: ఆక్వా అక్రమ సాగుతో జిల్లాలో ప ర్యావరణానికి విఘాతం కలుగుతోందని ఎమ్మెల్యే కుడుపూ డి సూర్యనారాయణరావు అన్నారు. ఈ సమస్య ను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, గోదావరి పరీవాహక ప్రాంతాలు, మడ అడవు లు, డి–పట్టా భూముల్లో సైతం ఆక్వా అక్రమ సాగు యథేచ్ఛగా జరుగుతోందని అన్నారు. కోనసీమలో దశాబ్దాలుగా చమురు, గ్యాస్‌ నిక్షేపాల ను వెలికి తీస్తున్న చమురు సంస్థలు తమ లాభా ల్లో కొంత భాగాన్ని ఆయా ప్రాంతాల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద వెచ్చించాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. అయితే, చమురు సంస్థలు నోరున్న ప్రజాప్రతినిధులకు తాయిలాలుగా ఇచ్చేసి, అరకొరగా విదిలిస్తున్నాయని ఆరోపించారు. అందువల్లనే ప్రజాప్రతినిధులు పర్యావరణం, ఆక్వా అక్రమ సాగు గురించి మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు. సీఎస్‌ఆర్‌ నిధుల ను సద్వినియోగం చేయాలని డిమాండ్‌ చేశారు. ఐ.పోలవరం మండలంలో 200 ఎకరాల మడ అడవులను నరికేసి, ఆక్వా చెరువులు అక్రమంగా తవ్వేశారని ఆరోపించారు. ఇవన్నీ డి–పట్టా భూములన్నారు. జిల్లాలో సహజ వనరులను ధ్వంసం చేసి, ఆక్వా అక్రమ సాగు చేస్తున్న చోట్ల స్థానికులు స్పందించి, తన వద్దకు వస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేలా సహాయపడతానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు చెప్పారు.

కోనసీమ మహిళా రచయిత్రిల

సంఘం ఆవిర్భావం

అమలాపురం టౌన్‌: కోనసీమ రచయితల సంఘానికి అనుబంధంగా కోనసీమ రచయిత్రిల సంఘం ఆవిర్భవించింది. దీనికి గౌరవాధ్యక్షులుగా డాక్టర్‌ ప్రభల జానికి (అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు), పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి (అమలాపురం) సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని 23 మంది రచయిత్రులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని అనంతలక్ష్మీదేవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement