అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 271 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ సిటిజన్ క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. వీటిని ప్రజలు స్కాన్ చేసి, ప్రభుత్వ సేవలపై తమ అభిప్రాయాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


