పిల్లల చదువుల కోసం 2017 జనవరి 8న ఉట్రుమిల్లి గ్రామానికి చెందిన నున్న సూరిబాబు వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాను. ఆ సమయంలో ప్రామిసరీ నోటుతో పాటు ఆధార్ కార్డు ప్రతులు, ఖాళీ పేపర్‌పై సంతకాలు తీసుకున్నారు. 2017 జనవరి 28న అసలు, వడ్డీ పూర్తిగా చెల్లించేందుకు వెళ్లగా దుర్భాషలాడి తనను అక్కడి నుంచి పంపించేశారు. ఖాళీ పేపర్‌పై తనతో చేయించుకున్న సంతకాన్ని దుర్వినియోగం చేసి, ఉట్రుమిల్లిలో తనకు చెందిన 5 సెంట్ల భూమి కబ్జా చేశారు. సూరిబాబుపై చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం. – బలభద్రుని వెంకటేశ్వరరావు, కుమ్మర్ల వీధి, రామచంద్రపురం
(ఈ సమస్యపై ఎస్పీ రాహుల్ మీనాకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.)


