● సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
● రైతులకు వ్యవసాయాధికారుల
అవగాహన
అనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో అడపాదడపా కురిసే వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలకు ఖరీఫ్ వరి పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. మండలంలోని పులగుర్త గ్రామంలో గురువారం ఆత్మ సౌజన్యంతో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు జాగ్రత్తలు వివరించారు. ఆ ప్రకారం..
● ఎల్‌నినో నేపథ్యంలో వరిని ఆకునల్లి ఆశించి, ఆకులు ఎర్రబడతాయి. దాని నివారణకు డైకాఫోల్ 5.0 మిల్లి లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● ఎండాకు తెగులు సోకితే పొలంలోని పాత నీటిని తీసివేసి ఆరగట్టి తిరిగి నీరు పెట్టాలి. నత్రజని ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను ఎకరాకు 20 కిలోలు చల్లాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ హైడ్రాకై ్సడ్ 2.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● గడ్డి దుబ్బు తెగులు లేదా కాండం కుళ్లు తెగులు క నిపిస్తే, నివారణకు టెబ్యూకోనజోల్ 2.0 మిల్లీ లీ టర్ల మందు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● ఎలుకల నివారణకు పొలం గట్లను చెక్కుకొని, అక్కడక్కడా ఎలుక బుట్టలు అమర్చుకొంటే, వలస పోయే ఎలుకలు అందులో పడి చనిపోతాయి. ఎలుక బొరియల్లో పొగబారించాలి. బ్రోమోడయోలిన్ 2 శాతం ఎర మందు (96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు బ్రోమోడయోలిన్ మందు) తయారు చేసి, 10 గ్రాముల పొట్లాలుగా కట్టి, ఎలుక బోరియల వద్ద అమర్చాలి. రైతులందరూ ఈ ప్రక్రియను సామూహికంగా చేపట్టాలి.
● వరిలో మొవ్వు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లేదా క్లోరంట్రనిలిప్రోల్ 0.3 గ్రాములు లేదా క్లోరిఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


