మోతుగూడెం: మోటారు సైకిల్‌పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై చరణ్ నాయక్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి గుంటూరుకు పది కేజీల గంజాయిని బైక్‌పై ఇద్దరు యువకులు తరలిస్తున్నారు. గుర్తేడు మండలం బొడ్డుగంటి పంచాయతీ పరిధిలో డొంకరాయి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరుకు చెందిన సద్దాం పవన్ మాధవ్, కుందేటి చెన్నకేశవరావును అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
లోవలో జంతుబలి నిషేధించాలి
తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానంలో జంతుబలి, మద్యాన్ని నిషేధించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఆయన గురువారం కుటుంబ సభ్యులతో లోవ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠం తరఫున అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, మహా హారతి సేవలు నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. లోవలో జంతువులను వధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నిషేధించాలని కోరుతూ కార్యనిర్వహణ అధికారికి లేఖ ఇచ్చినట్టు తెలిపారు.


