అయినవిల్లిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అయినవిల్లిలో భక్తుల సందడి

Jul 20 2026 12:32 AM | Updated on Jul 20 2026 12:32 AM

అయినవిల్లి: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్‌) ఆధ్వర్యాన మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి 8 గంటలకు విశేష సేవల అనంతరం ఆలయం తలుపులు మూసివేశారు. స్వామివారికి రెండు జంటలు పంచామృతాభిషేకం నిర్వహించాయి. భక్త దంపతులు 33 మంది లఘున్యాస అభిషేకాలు జరిపారు. రెండు జంటలు గరిక పూజ నిర్వహించాయి. ఓ భక్తుడు ఉండాళ్ల పూజ జరిపారు. భక్త దంపతులు 14 మంది శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకున్నారు. ఆరుగురు చిన్నారులకు అన్నప్రాశన చేశారు. ఎనిమిది మందికి తులాభారం నిర్వమించారు. నూతన వాహనాలకు 42 మంది భక్తులు పూజలు నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదం 2,530 మంది స్వీకరించారు. అన్ని విభాగాల ద్వారా ఆలయానికి రూ.2,89,866 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement