ప్రతి కార్యకర్తతో అనుసంధానమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రతి కార్యకర్తతో అనుసంధానమే లక్ష్యం

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

వైఎస్సార్‌ సీపీ నేతలు

జగనన్న 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ

అమలాపురం రూరల్‌: వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పార్టీ నాయకత్వంతో అనుసంధానమయ్యేందుకే జగనన్న 2.0 సూపర్‌ యాప్‌ను అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని ఆ పార్టీ నేతలు అన్నారు. జగనన్న 2.0 సూపర్‌ యాప్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్టినేటర్‌, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్‌, నియోజకవర్గ కో ఆర్టినేటర్లు పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ (ముమ్మిడివరం), డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ (అమలాపురం), పాముల రాజేశ్వరి (రాజోలు), గన్నవరపు శ్రీనివాసరావు (పి.గన్నవరం) శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాప్‌ వినియోగంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమాచార మార్పిడి, పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు తదితర అన్ని అంశాలనూ ఈ యాప్‌ ద్వారా ఒకే వేదిక మీదికి తీసుకొచ్చారని చెప్పారు. సోషల్‌ మీడియాలో పార్టీ శ్రేణులు పోస్ట్‌ చేస్తున్న అంశాలను కుట్రలు పన్ని ఇష్టం వచ్చినట్లు డిలీట్‌ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో నే జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ తీసుకొచ్చారని తెలిపారు. ఇందులో ప్రతి కార్యకర్తా తన అభిప్రాయం నిర్భయంగా చెప్పవచ్చన్నారు. ఇది పార్టీ యాప్‌ కాబట్టి, కేవలం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మాత్రమే ఇందులో ఉంటారన్నారు. దీనివలన ఎవరు పడితే వారు డిలీట్‌ చేసే అవకాశం ఉండదని చెప్పారు.

ఈ యాప్‌ను ప్రతి కార్యకర్తా డౌన్‌లోడ్‌ చేసుకుని, తమ మొబైల్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కోరారు. దీని ద్వారా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నాయకులతో ప్రతి కార్యకర్తా అనుసంధానమవుతారని చెప్పారు.

కార్యక్రమంలో పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, దంగేటి రాంబాబు, సీఈసీ సభ్యుడు కుడుపూడి బాబు, నేతలు పీకే రావు, కుడుపూడి భరత్‌ భూషణం, ఆర్‌టీఐ విభాగం జోన్‌–2 అధ్యక్షుడు కొల్లు త్రినాథవర్మ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సలాది సతీష్‌, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మండలాల అధ్యక్షులు బద్రి బాబ్జీ, కొనుకు బాపూజీ, ఎంపీపీ శేషారావు, నియోజవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement