దివంగత ముద్రగడ పట్ల వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అపార గౌరవాన్ని ప్రకటించారు. ముద్రగడ అస్వస్థతకు గురైనప్పటి నుంచీ ఆయనను కాపాడుకునేందుకు జగన్ చొరవ చూపారు. ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడి పర్యవేక్షణలో వైద్యం అందించే ఏర్పాటు చేశారు. అయితే, విధి చిన్నచూపు చూసిందేమో! ముద్రగడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహాన్ని దర్శించి, నివాళులర్పించేందుకు వైఎస్ జగన్ బుధవారం మధ్యాహ్నం కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వయంగా ముద్రగడ పాడె మోసి ఆయన పట్ల తనకున్న అపార గౌరవాన్ని చాటుకున్నారు. జగన్ వెంట భారీ సంఖ్యలో అభిమానులు సైతం ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. అభిమానులు సైతం ముద్రగడ భౌతికకాయాన్ని ఆయన ఇంటి ఆవరణలో సాయంత్రం ఖననం చేసిన తరువాత, బాధాతప్త హృదయాలతో అక్కడి నుంచి వెనుతిరిగారు.


