ముద్రగడతో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో సమున్నత విలువలకు పెద్ద పీట వేసిన నాయకుడు.
– పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజ్యసభ మాజీ సభ్యుడు, పిల్లి సూర్యప్రకాశ్,
వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్
తీరని లోటు
ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు. 1978లో ముద్రగడ, 1985లో ఎమ్మెల్యేలుగా కలిసి పని చేశాం. అప్పటి నుంచీ ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాపుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేశారు. మంత్రిగా, ఎంపీగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. అటువంటి నాయకుడు మరొకరు పుట్టరు, చూడం.
– గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు
మహోన్నతుడు
ముద్రగడ మరణ వార్త తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. రాష్ట్రానికి, కాపు సామాజిక వర్గానికి ఆయన మర ణం తీరని లోటు. కాపు సామాజిక వర్గం హక్కు లు, సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి.
– చింతా అనురాధ, మాజీ ఎంపీ, అమలాపురం
బాధాకరం
కాపు ఉద్యమానికి జీవితాంతం అంకిత భావంతో సేవలందించిన ముద్రగడ పద్మనాభం మృతి చెందడం అత్యంత బాధాకరం.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
అందరికీ ఆదర్శం
ముద్రగడ మరణ వార్త తీవ్రంగా కలచివేసింది. ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం.
– గన్నవరపు శ్రీనివాసరావు,
వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పి.గన్నవరం


