కోర్టుల్లో న్యాయమూర్తులను భర్తీ చేయండి | - | Sakshi
Sakshi News home page

కోర్టుల్లో న్యాయమూర్తులను భర్తీ చేయండి

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

అమలాపురం టౌన్‌: స్థానిక కోర్టుల్లో ఖాళీగా ఉన్న రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీ కోరుతూ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారు. ఈ మేరకు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ బట్టు దేవానంద్‌లకు స్థానిక బార్‌ న్యాయవాదులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని బార్‌ సభ్యులు తెలిపారు. ఈ నియామాకాలు జరిగితే సత్వర న్యాయ సేవలు అందుతాయని పేర్కొంటూ వారు న్యాయమూర్తులను సత్కరించారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కె.చిదంబరంతోపాటు స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చింతపల్లి అజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు యాలంగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దొమ్మేటి వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రం అంజేసినవారిలో ఉన్నారు.

మరో 2 కోర్టులు మంజూరు

అమలాపురం టౌన్‌: అమలాపురానికి మరో రెండు కోర్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు జీఓ విడుదలైంది. అమలాపురానికి 14వ జిల్లా అదనపు కోర్టు, 2వ సివిల్‌ జూనియర్‌ జడ్జి కోర్టు మంజూరయ్యాయి. దీనిపై బార్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement