అమలాపురం టౌన్: రాష్ట్రంలోనే తొలిసారిగా స్థానిక డివిజన్ ప్రధాన తపాలా కార్యాలయంలో ఆదివారం మదర్ ఫీడిండ్ రూమ్ ఏర్పాటైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీకర్‌బాబు ఈ రూమ్‌ను ప్రారంభించారు. పోస్టల్ కార్యాలయాలకు వచ్చే చంటి పిల్లల తల్లుల సౌకార్యార్థం ఈ గదిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం విశేష ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు జ్ఞాపికలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత వారికి క్విజ్‌తో పాటు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. మహిళలను, ఆడపిల్లలను గౌరవించడంలో తమ శాఖ ఎప్పుడూ ముందు ఉంటుందని శ్రీకర్‌బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పదేళ్ల లోపు ఆడ పిల్లలకు అమలవుతున్న సుకన్య సమృద్ధి పథకంలో ఎక్కువ మంది చేరేలా ఆడపిల్లల తల్లిదండ్రులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అమలాపురం, రాజోలు హెడ్ పోస్టు మాస్టర్లు కుసుమకుమారి, రుక్మిణి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీధరంతో పాటు పోస్టల్ ఇన్‌స్పెక్టర్లు, పోస్టల్ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
డ్రెయిన్‌లో శిశువు
మృతదేహం
మామిడికుదురు: పాశర్లపూడిలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బొమ్మిడిపాలెంలోని వాడబోది మీడియం డ్రెయిన్‌లో సుమారు వారం రోజుల వయసు కలిగిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. వీఆర్వో ఫిర్యాదుతో నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేశారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


