పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
డేగ ప్రభాకర్
మలికిపురం: రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను ప్రభుత్వం దూరం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. రాజోలు నియోజకవర్గ స్థాయి సీపీఐ శత దినోత్సవాన్ని శుక్రవారం మలికిపురంలో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న స్థాపించిన సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వాడవాడలా సీపీఐ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో 62 మంది కమ్యూనిస్ట్ సభ్యులు ఉన్నప్పుడు కూలీల వలసల నియంత్రణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించిందని అన్నారు. నేటి పాలకులు ఈ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సత్తిబాబు, చెల్లుబోయిన తాతారావు, గెడ్డం ప్రభాకర్‌రావు, దేవ సురేష్‌బాబు, దొండపాటి చిట్టిరాజు, పుల్లెల ఆనంద్, మేడిచర్ల సత్యనారాయణ, వై.వెంకట్, పిచ్చిక గంగాధర్‌రావు, దీపాటి గంగాచలం, ఆకన నాగేశ్వరరావు, బత్తుల రవిప్రసాద్, డి.భానోజీ, వానపల్లి చిట్టిబాబు, భూపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


