భీమేశ్వరాలయ ముఖద్వారానికి కోడి పందేల ఫ్లెక్సీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ముఖ ద్వారానికి కోడి పందేలకు సిద్ధం అన్నట్టుగా ఉన్న రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఇప్పటికే భీమేశ్వరస్వామి ఆలయంలోని పురాతన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీకి చెందిన నాయకుడి సోదరుడు ముద్దాయిగా తేలడం, ఇప్పుడు అదే తోటపేట గ్రామానికి చెందిన నాయకుడు బుచ్చిరాజు కాకినాడ రోడ్డులోని ప్రధాన రహదారిపై ఉన్న భీమేశ్వరస్వామి ఆలయ ముఖద్వారానికి కోడి పందేలకు సిద్ధం అన్నట్లు ఉన్నఫ్లెక్సీని పెట్టడంతో ఇటు భక్తులు, అటు సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు తక్షణం ఈ ఫ్లెక్సీని ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.
మండిపడుతున్న భక్తులు


