
ఫుడ్ పాయిజన్ మూలాలు తెలుసుకుంటాం
డీఎం హెచ్‌ఓ దుర్గారావు దొర
అంబాజీపేట: అంబాజీపేటలో ఫుడ్ పాయిజిన్ జరిగి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.దుర్గారావు దొర శనివారం ఉదయం పరామర్శించి బాధితులకు మనోధైర్యం కల్పించారు. ఈ నెల 15వ తేదీన మాచవరానికి చెందిన 22 మంది స్థానిక హొటల్ నుంచి తీసుకువచ్చిన టిఫిన్ తిని అస్వస్థతతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో 18 మంది అంబాజీపేట, మరో నలుగురు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు పరిశీలిస్తున్నామని, ఇప్పటికే నమూనాలు సేకరించామని, పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వైద్యులకు, ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశించారు. పరామర్శించిన వారిలో తహసీల్దార్ బి.చినబాబు, డిప్యూటీ ఎంపీడీఓ కె.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.