
తప్పాసులు జాగ్రత్త
ఫ కాల్చేటప్పుడు అప్రమత్తత అవసరం
ఫ పిల్లలను ఓ కంట కనిపెట్టాలి
ఫ ఈ నెల 20న దీపావళి పర్వదినం
కొత్తపేట: మతాబుల మమతలు పూయ.. చిచ్చుబుడ్లు కాంతులనీయ.. తారాజువ్వలు గాలిలో ఎగరేయ.. వెన్నముద్దలు వెలుగులనీయ.. అందాల తారలు వాకిట్లో వాలినట్లు టపాసులతో సందడి చేయ.. వెలుగుల పండగను ఆనందాల రవళిలా జరుపుకొందాం. ఈ నెల 20న దీపావళి సందర్భంగా టపాసుల మోతతో ఊరూవాడా దద్దరిల్లనుంది. అయితే వాటిని కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి వారే గ్రహించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి రోజున పాటించాల్సిన జాగ్రత్తలు కొత్త కాకపోయినా మరోసారి గుర్తు చేసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. టపాసులు కాల్చే చిన్నారులను దగ్గరుండి చూసుకోవాలని, వారి విషయంలో తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ బాణసంచా తయారీలో యాజమాన్యం, సిబ్బంది విశ్రమించకుండా పనిలో నిమగ్నమవుతారు. చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్త పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఏటా జిల్లాలో ఒకటో, రెండో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ ఏడాది తాజాగా రాయవరంలో భారీ విస్ఫోటం సంభవించి పది మంది, అయినవిల్లి మండలం విలసలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటనలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇకపై ఏ చిన్న ప్రమాదం జరగకుండా దీపావళిని జరుపుకోవాలని సూచిస్తున్నారు.
పండుగ రోజున ఇలా చేద్దాం..
ఫ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివామిలు, పూరి గుడిసెలు ఉండే ప్రదేశాల్లో రాకెట్లు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు వంటి టపాసులు కాల్చరాదు.
ఫ టపాసుల పనితీరు, వెలిగించాల్సిన విధానం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
ఫ పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే క్రాకర్స్ కాల్చాలి.
ఫ ఇరుకై న ప్రదేశాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట టపాసులు కాల్చరాదు.
ఫ బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.
జిల్లాలో బాణసంచా షాపులు
తయారీ కేంద్రాలు 18
హోల్‌సేల్ షాపులు 15
రిటైల్ షాపులు సుమారు 455
(తాత్కాలిక లైసెన్స్ షాపులు)
అగ్నిమాపక కేంద్రాల ఫోన్,
ఎస్‌ఎఫ్‌ఓల ఫోన్ నంబర్లు
అమలాపురం–9963727665– 8856 231101
కొత్తపేట – 9963728051 – 08855 243299
మండపేట – 9963727741–08855 232101
రామచంద్రపురం–9440149394–08857 242401
రాజోలు– 9603727995 – 08862 221101
ముమ్మిడివరం–7989956542–08856271101
పర్యావరణాన్ని పరిరక్షించేలా..
దీపావళి రోజున పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అన్నివర్గాల ప్రజలు చైతన్యవంతులు కావాలి. క్రాకర్స్ ఎంత తక్కువ వినియోగిస్తే వాతావరణ కాలుష్యం అంత తగ్గుతుంది. దీపావళి అంటేనే వెలుగుల పండగ. అందుకే ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకుని పండగ జరుపుకోవాలని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
వ్యాపారులూ అప్రమత్తత అవసరం
జనసంచారం లేని, ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రమాదాలు జరగకుండా తగిన అగ్ని ప్రమాద నియంత్రణ సామగ్రి ఉంచుకోవాలి. బాణసంచా అమ్మే చోట ఇసుక, నీరు, కార్బన్ డై ఆకై ్సడ్‌ను అందుబాటులో ఉంచాలి. దుకాణాల వద్ద పొగ, మద్యం తాగరాదు. ప్రతి దుకాణానికి మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే విక్రయ కేంద్రాల వద్ద విద్యుత్ వైరింగ్ సరిగ్గా చూసుకోవాలి. ప్రతి షాపు వద్ద క్రాకర్స్ ధరల పట్టిక, అగ్నిమాపక కార్యాలయం ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి.