
అనుమతులు తప్పనిసరి
బాణసంచా తయారీ, హోల్‌సేల్, రిటైల్ విక్రయదారులు కచ్చితంగా నిర్దేశిత అనుమతులు పొందాలి. అక్రమంగా మందుగుండు సామగ్రి కలిగి ఉన్నా, అమ్మకాలు చేపట్టినా చర్యలు తప్పవు. సమస్యలు తలెత్తితే తక్షణమే పోలీసు, సమీపంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందించాలి.
–పి.శ్రీకర్, ఆర్డీఓ, కొత్తపేట
చర్యలు తీసుకోవాలి
ఎక్కడైనా అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల మేర మాత్రమే క్రాకర్స్ విక్రయాలు చేపట్టాలి. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి.
–సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట
వెంటనే సమాచారం అందించాలి
దీపావళి బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పూరిళ్లు, గడ్డివామిలు ఉండేచోట వాటిని నీటితో తడపడం, నీటిని సమీపంలో ఉంచుకోవడం మేలు. అలాగే బాణసంచా అమ్మేవారు కూడా అగ్నిమాపక నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం జరిగితే తక్షణమే 100, 101కు లేదా సమీపంలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. –ఎన్.పార్థసారధి,
జిల్లా అగ్నిమాపక అధికారి, అమలాపురం

అనుమతులు తప్పనిసరి