
తండ్రిని సాగనంపి.. తనయుడూ ఆ వెనకే..
● అంతిమ సంస్కారం చేసివచ్చి కుప్పకూలిన తనయుడు
● తండ్రి మరణం జీర్ణించుకోలేక మృతి
ప్రత్తిపాడు రూరల్: తండ్రి తహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తనయుడు అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మండలంలోని ఉత్తరకంచిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కందా నరసింహమూర్తి (70) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు కందా రాజా (45) తండ్రికి దహన సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజా ఆరోగ్యం సహకరించకపోవడానికి తోడు, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు రాజాను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆయన అతంత్యక్రియలను బంధువులు నిర్వహించారు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కన్నీరు పెట్టించింది. రాజా పంచాయతీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. రాజా కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

తండ్రిని సాగనంపి.. తనయుడూ ఆ వెనకే..