
కాకినాడలో గోల్డ్‌కప్ హాకీ ఇండియా పోటీలు
● ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
● ఘనంగా ఫెన్సింగ్ పోటీల
ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో మొదటి సారిగా గోల్డ్‌కప్ హాకీ ఇండియా చాంపియన్‌షిప్ 2026 పోటీలు జరుగుతాయని క్లబ్ ఫౌండర్ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు పోటీల బ్రోచర్‌ను శనివారం కలెక్టర్ షణ్మోహన్‌కు అందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో 12 పురుషుల జట్లు, ఆరు మహిళా జట్లు పాల్గొంటాయన్నారు.
హాకీ ఇండియా పోటీల బ్రోచర్‌ను కలెక్టర్‌కు అందజేస్తున్న క్లబ్ సభ్యులు
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ రూరల్ మండలం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్‌లో అండర్–14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్స్ విభాగంలో నిర్వహించే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల పల్లి రామస్వామి, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, సుగుణారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి కృష్ణమోహన్, మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ బొహ్రా పాల్గొన్నారు.

కాకినాడలో గోల్డ్‌కప్ హాకీ ఇండియా పోటీలు

కాకినాడలో గోల్డ్‌కప్ హాకీ ఇండియా పోటీలు