మోరపల్లిలో మహిళ హత్య.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి..! | Women Murdered In Jagtial | Sakshi
Sakshi News home page

మోరపల్లిలో మహిళ హత్య.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి..!

Jun 9 2022 4:15 AM | Updated on Jun 9 2022 4:15 AM

Women Murdered In Jagtial - Sakshi

జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో బుధవారం మరో హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లి శివారులోని ఊరు చెరువులో చేపలు పట్టేం దుకు బుధవారం ఉదయం మత్స్యకారులు వెళ్లారు. అక్కడ ఓ మహిళ (సుమారు 35) మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బుధ వారం వేకువజామున హత్యకు గురైనట్లు సంఘటన స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు.

ఎక్కడి నుంచో ఓ మహిళను తీసుకొచ్చి మద్యం తాగించి అత్యాచారం చేసి.. ఆమె ప్రతి ఘటించడంతో గొంతుకోసి, తలపై బాది చంపినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన మహి ళల కేసుల నమోదుపై ఆరా తీస్తున్నారు. లైంగిక దాడికి గురైన మహిళ ఎవరు, ఆమెపై అత్యాచారం చేసిన వారెవరు? అనే విషయాలేవీ ప్రస్తుతం తెలియరాలేదని డీఎస్పీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement