సీఐ అవమానించారని మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

Woman Home Guard Suicide Attempt In Kurnool District - Sakshi

సీఐ అవమానించారంటూ సెల్ఫీ వీడియో చిత్రీకరణ

ఆదోని(కర్నూలు జిల్లా): స్థానిక త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీపై వచ్చిన మహిళా హోంగార్డు రామకృష్ణమ్మ ఆదివారం తన ఇంట్లో శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీఐ చేసిన అవమానానికి తట్టుకోలేక ఈ  అఘాయిత్యానికి పాల్పడినట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈమె తన ముగ్గురు పిల్లలతో ఆదోనిలోని సీతారామనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషను నుంచి బదిలీపై ఆదోని త్రీటౌన్‌కు వచ్చారు. సీఐకు రిపోర్టు చేయగా జాయిన్‌ చేయించుకోలేదని, తిరిగి ఎమ్మిగనూరుకు వెళ్లమన్నారని, అవమానకరంగా మాట్లాడారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆమె శానిటైజర్‌ తాగారు. ఇరుగుపొరుగు వారు, బందువులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై త్రీ టౌన్‌ సీఐ నరేష్‌బాబు మాట్లాడుతూ.. రాత్రి పూట గస్తీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో తాను హోంగార్డు ఇన్‌చార్జ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఆమెకు రిటర్న్‌ పాస్‌పోర్ట్‌ ఇచ్చానన్నారు. తాను అవమానించినట్లు హోంగార్డు రామకృష్ణమ్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు.

రామకృష్ణమ్మకి పరామర్శ 
సాక్షి, అమరావతి: మహిళా హోంగార్డు రామకృష్ణమ్మ ఆత్మహత్యా ప్రయత్నం ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌ ఆరా తీసింది. ఈ విషయంపై ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదివారం ఎస్పీ ఫక్కీరప్పతో మాట్లాడారు. బాధితురాలు రామకృష్ణమ్మను ఆమె ఫోన్లో పరామర్శించి, ధైర్యం చెప్పారు.

చదవండి: బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. భర్త ఒక్కసారిగా షాక్‌
వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ...

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top